తూకివాకంలో వేస్ట్ సెంటర్‌ పరిశీలించిన సీఎం

తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలోని తూకివాకలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. కేంద్రంలోని పని తీరు, సేకరణ ప్రక్రియ, వ్యర్థాల ప్రాసెసింగ్ విధానాలపై అధికారులను అడిగి పూర్తి వివరాలను తెలుసుకున్నారు. స్వచ్ఛమైన పరిసరాల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందన్నారు సీఎం. తద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజారోగ్యం మెరుగవుతుందని అభిప్రాయపడ్డారు. waste-to-energy, composting వంటి ఆధునిక విధానాలపై అధికారులతో చర్చించిన సీఎం, భవిష్యత్‌లో మరిన్ని ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

నారాసుర రక్తచరిత్ర అంటూ నాకు మోసం చేశారు

‘‘నేను మోసపోయాను… మీరు పాపం అనుకున్నారు… కానీ చివరికి నా జీవితమే కోల్పోయినంత పని అయ్యింది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

బాబాయికి గుండెపోటు వచ్చిందని నమ్మించారు కానీ, పోస్టుమార్టం చేసిన తర్వాత అది గుండెపోటు కాకుండా గొడ్డలితో చేసిన హత్య అని తెలుస్తే, నిజం ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. ‘‘పొద్దునే పేపర్లలో నారాసుర రక్తచరిత్ర అంటూ కథలు రాసి, కత్తిని నా చేతిలో పెట్టేశారు. నిజం ఎవరూ వెదకలేదు, నేను చేసిన పని ఏమీ లేకపోయినా నన్నే నిందించారు’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తనపై జరిగిందంతా రాజకీయ పక్షపాతమేనని, న్యాయం కోసం తాను ఎదురుచూస్తానని తెలిపారు. అబద్ధపు ఆరోపణలతో తన జీవితాన్ని శత్రువులు మలిచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Read More : టీటీడీ సస్పెన్షన్‌పై బండి సంజయ్ స్పందన

One thought on “తూకివాకంలో వేస్ట్ సెంటర్‌ పరిశీలించిన సీఎం

Comments are closed.