మహబూబ్ నగర్ జిల్లాలోని టీడీగుట్ట ప్రాంతంలో చిరుత కనిపించడంతో ప్రజల్లో కలకలం రేగింది. జనావాసాలకు సన్నిహితంగా ఈ చిరుత సంచరించడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది. సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ అధికారులు, పోలీస్ బృందాలు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించాయి.
చిరుతను చూడడానికి పెద్ద ఎత్తున ప్రజలు గుట్ట పైకి చేరడంతో జనం గుమిగూడారు. పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు వారిని చెదరగొట్టారు. అయితే చిరుత తాలూకు కదలికలను పసిగట్టి, గమనించేందుకు అధికారులు కెమెరాలు అమర్చారు. చిరుతను ఏదైనా పొరపాటు జరగకుండా పట్టుకునేందుకు అటవీ శాఖ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది.
Read More : తెలంగాణ రవాణా రంగంలో మరో అడుగు.. ?

One thought on “Mahabubnagar : అటవీ శాఖ హుటాహుటిన రంగంలోకి”
Comments are closed.