ఇది AI వీడియోనా? నిజమైన వీడియోనా?

ఇప్పుడు ప్రపంచం దృష్టి అంతా AI పైనే ఉంది. అందుకే చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. AI ద్వారా చేసిన ఓ వీడియో నకిలీది అని నమ్మడానికి టైం పడుతోంది. ఏదో చూశామా, వదిలేశామా అనుకుంటే ఏది నకిలీ, ఏది అసలు అన్నది గుర్తించటం కష్టం. అందుకు ఉదాహరణే వాస్తవంలా కనిపించే నకిలీ వీడియో. సాధారణ భారతీయ కుటుంబం పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నట్లు కనిపించే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక మహిళ టేబుల్ పై కేక్ పెట్టడం, ఓ పురుషుడు కొవ్వొత్తిని ఊదడం, పిల్లలు చప్పట్లు కొట్టడం లాంటి సన్నివేశాలు ఇందులో కనిపిస్తాయి. మొదట చూస్తే ఇది నిజమైన ఇంట్లో వీడియో అనిపిస్తుంది. కానీ, నిజానికి ఇది కృత్రిమ మేధస్సు (AI) సాయంతో రూపొందించిన నకిలీ వీడియో.

ఈ వీడియోను Flux Pro with Seedance అనే ఏఐ మోడల్ తో రూపొందించారు. ఇది అత్యంత సాదాసీదా హోమ్ వీడియో స్టైల్ ను లక్ష్యంగా తీసుకుని రూపొందించబడింది. అయితే, ఈ వీడియోని నిశితంగా పరిశీలిస్తే కొన్ని చిన్న చిన్న లోపాల వలన ఇది అసలు వీడియో కాదని చెప్పవచ్చు.

ఈ వీడియో అసలైనది కాదని ఎలా చెప్పొచ్చు…

*మహిళ రెండు చెవుల్లో రెండు భిన్నమైన ఇయర్ రింగ్స్ ధరించింది

  • కొవ్వొత్తి ఆర్పిన తర్వాత మరింత ప్రకాశవంతంగా కనిపించింది
  • ఒక పిల్లాడు ఒక చేతితోనే చప్పట్లు కొడుతున్నాడు
  • ఆ వ్యక్తి పట్టుకున్న కార్డు బోర్డు బాక్స్, కేక్ టేబుల్ పై పెట్టిన తర్వాత మాయమైంది

ఈ వీడియో నకిలీ అయినప్పటికీ.. ఇది ఏఐ టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో చెబుతుంది. నిజమైన వీడియోలేనా? కృత్రిమ మేధస్సు సృష్టించిందా? అనే తేడాను గుర్తించడం కష్టమవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్ల రియాక్షన్లు భిన్న రకాలుగా ఉన్నాయి. నమ్మలేకపోతున్నా అంటూ చాలామంది కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరేమో, ఇక మనం అయిపోయాం అంటూ స్పందించారు. ఇంకొందరు ఏఐ రూపొందించిందని అసలు అనుకోలేదని కామెంట్ చేస్తున్నారు. టెక్నాలజి ఎంతగా మన జీవితాల్లో పెనవేసుకుందో అనడం కన్నా…టెక్నాలజీనే మనుషులను, భవిష్యత్తును శాసిస్తుందా అన్న సందేహాలు మొదలయ్యాయి.

Read More : వాట్సాప్‌లో ప్రకటనలకు మెటా గ్రీన్ సిగ్నల్