జమ్మూకశ్మీర్‌కు హోదా కోరిన రాహుల్, ఖర్గే

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. ఈ నెల 21న ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో జమ్మూకశ్మీర్‌కు తిరిగి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించాలని వారు కోరారు. అదేవిధంగా, లఢఖ్‌ను రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు.
ఈ లేఖలో గతంలో జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని ప్రధాని మోదీ ఇచ్చిన హామీని గుర్తు చేశారు. గత ఐదేళ్లుగా జమ్మూకశ్మీర్ ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారని పేర్కొన్నారు. వారి డిమాండ్ న్యాయమైనదని అభిప్రాయపడ్డారు.

కేంద్ర పాలిత ప్రాంతాలకు గతంలో రాష్ట్ర హోదా ఇచ్చిన పలు ఉదాహరణలు ఉన్నప్పటికీ, జమ్మూకశ్మీర్ విషయంలో ఆలస్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. కేంద్రం న్యాయంగా, ప్రజాస్వామ్యబద్ధంగా స్పందించాలని కోరారు.

Read More : photos : విద్యార్థినిపై అత్యాచారం చేసిన అధ్యాపకులు