పల్నాడు జిల్లాలోని క్రోసూరు మండలం ఎర్రబాలెం గ్రామంలో ఆస్తి వివాదం ఘోర సంఘటనకు దారితీసింది. భూక్యా వెంకటేశ్వర్లు నాయక్ అనే వ్యక్తి తన కుమారుడు మంగ్యా నాయక్ (19)ను హత్య చేసి, మృతదేహాన్ని కాలువలో పూడ్చిన ఘటన కలకలం రేపుతోంది. పోలీసుల కథనం ప్రకారం… కుటుంబ ఆస్తులపై తలెత్తిన వివాదం నేపథ్యంలో వెంకటేశ్వర్లు తన కుమారుడిని హత్య చేసినట్టు వెల్లడైంది. బంధువుల అనుమానంతో విషయం వెలుగులోకి రావడంతో వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్నారు.
ప్రాథమిక విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించడంతో, పోలీసులు మృతదేహాన్ని బయటకు తేవడంతో పాటు పోస్టుమార్టం కోసం తరలించారు. ఘటనకు సంబంధించి గ్రామంలో ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ దారుణ ఘటనతో గ్రామంలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది.
Read More : నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి ఖైదీ పరార్

One thought on “పల్నాడు జిల్లాలో హృదయవిదారక ఘటన”
Comments are closed.