అమెరికాలో కొత్త రాజకీయ శక్తి అవసరమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యానించారు. దేశాన్ని కాపాడేందుకు మూడో పార్టీ అనివార్యమని అభిప్రాయపడ్డారు. ఈ ప్రక్రియలో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌తో కలిసి పనిచేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మస్క్‌కు డబ్బు ఉందని, తానికైతే భారీ ప్రజాధారణ ఉందని తెలిపారు. తన కుమారుడు అమెరికాలోనే పుట్టి పెరిగాడని, భవిష్యత్తులో అమెరికా అధ్యక్షుడిగా ఆయనను చూడాలన్నదే తన కల అని చెప్పారు. ఇదిలా ఉండగా, యెమెన్‌లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ విషయంలో కూడా పాల్ స్పందించారు. ఈ నెల 16న నిమిష ప్రియకు శిక్ష అమలుకానున్న నేపథ్యంలో, ఆమెకు క్షమాభిక్ష ఇవ్వాలని పాల్ విజ్ఞప్తి చేశారు. 2017లో తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మెహదీని హత్య చేసిన కేసులో నిమిష ప్రియను ఉరిశిక్షకు గురిచేశారు. 2020లో శిక్ష ఖరారు కాగా, 2023లో ఫైనల్ అప్పీల్ తిరస్కరించబడింది. ఈ విషయంలో యెమెన్ ప్రధానమంత్రికు లేఖ రాశానని పాల్ తెలిపారు.
నిమిష ప్రియ ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. ఆమెను ఆమె బిజినెస్ పార్ట్నర్ మానసికంగా హింసించాడని, దానిని తట్టుకోలేక అతన్ని హత్య చేసిందని వివరించారు. హత్యను ఖండిస్తున్నానని, కానీ ఆమెకు క్షమాభిక్ష ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. యెమెన్ అధ్యక్షుడు ఆమెకు క్షమాభిక్ష మంజూరు చేస్తే, ఆయనను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తానని కేఏ పాల్ తెలిపారు. యెమెన్‌లో మహిళలకు రక్షణ లేదని కూడా ఆయన విమర్శించారు.
Read More : ఐఐఎం కలకత్తా విద్యార్థిని అత్యాచార ఆరోపణలు

One thought on “అమెరికాలో మూడో పార్టీ అవసరం: KA Paul”
Comments are closed.