సోనియా గాంధీ : ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యుల ప్రకటన

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ ఆరోగ్యంపై వెలుగులోకి వచ్చిన వార్త సాంత్వన కలిగిస్తోంది. ఇటీవల ఉదర సంబంధిత సమస్యలతో ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేరిన ఆమె, గురువారం డిశ్చార్జ్ అయ్యారు. వైద్యుల ప్రకారం, ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు.

జూన్ 15న ఆసుపత్రిలో చేరిన 78 ఏళ్ల సోనియా గాంధీకి, వైద్య నిపుణులు డాక్టర్ ఎస్. నూండీ, డాక్టర్ అమితాబ్ యాదవ్ నేతృత్వంలోని బృందం వైద్యం అందించింది. ఆమె పొత్తికడుపులో ఏర్పడ్డ ఇన్ఫెక్షన్‌కు మందులతో సాదారణంగా చికిత్స ఇచ్చారని, పరిస్థితి మెరుగుపడ్డ నేపథ్యంలో ఆమెను డిశ్చార్జ్ చేసినట్లు ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ తెలిపారు. ఇకపై చికిత్సను ఔట్‌పేషెంట్ విధానంలో కొనసాగించనున్నారు.ఇంతలోనే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన 55వ పుట్టినరోజు జరుపుకుంటుండగా తల్లి సోనియా గాంధీ డిశ్చార్జ్ కావడం వారి కుటుంబానికి ఆనందకరమైన క్షణాల్ని అందించింది. రాహుల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వివిధ పార్టీల నేతలు సోషల్ మీడియాలో సందేశాలు షేర్ చేశారు. తల్లి ఆరోగ్యం మెరుగవడం, ఇంటికి చేరడం ద్వారా కుటుంబానికి సంతోషాన్ని చేకూర్చింది.

Read More : ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై చంద్రశేఖరన్ స్పందన