ఐఐఎం కలకత్తా విద్యార్థిని అత్యాచార ఆరోపణలు

కోల్‌కతాలోని ప్రఖ్యాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) బాయ్స్ హాస్టల్‌లో ఓ విద్యార్థిని పై అత్యాచారం జరిగిందని తొలుత వచ్చిన ఆరోపణలు ఇప్పుడు ఆసక్తికర మలుపు తిరిగాయి. మానసిక సమస్యలతో బాధపడుతున్నానని చెప్పిన ఆ విద్యార్థిని, ఓ సహ విద్యార్థి కౌన్సిలింగ్ ఇస్తానంటూ హాస్టల్‌కు పిలిచి మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి, స్పృహ కోల్పోయిన తర్వాత అత్యాచారం చేశాడని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ ఘటనపై ఆ విద్యార్థిని తండ్రి స్పందించారు. తన కుమార్తెపై ఎటువంటి లైంగిక దాడి జరగలేదని స్పష్టం చేశారు. ఆమె ఆటో రిక్షా నుంచి జారిపడి అపస్మార స్థితిలోకి వెళ్లిందని పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి 9:34కి తనకు ఫోన్ వచ్చిందని, పోలీసులు తమ కుమార్తెను రక్షించి ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రిలోని న్యూరాలజీ విభాగానికి తరలించారని తెలిపారు. పోలీసుల సూచన మేరకు తన కుమార్తె ఫిర్యాదు పత్రంలో వివిధ అంశాలను రాసిందని చెప్పారు. తాను ఆమెతో మాట్లాడగా, అత్యాచారం జరగలేదని ఆమె తేల్చి చెప్పిందని స్పష్టం చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.

ఈ ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. మొదట ఆరోపణలు చేసి, ఆ తర్వాత వాటిని ఖండించడం నేపథ్యంగా ఈ కేసు మరింత చర్చనీయాంశమవుతోంది.

Read More : సెల్ఫీ పేరుతో భర్తను నదిలో తోసిన భార్య

One thought on “ఐఐఎం కలకత్తా విద్యార్థిని అత్యాచార ఆరోపణలు

Comments are closed.