చెన్నై సమీపంలోని కువం నది వద్ద జూలై 8న గుర్తించిన మృతదేహం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రారంభంలో ఈ ఘటనను అనుమానాస్పద మృతిగా గుర్తించిన పోలీసులు, తాజాగా వచ్చిన పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఇది స్పష్టమైన హత్యగా నిర్ధారించారు. దీంతో కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘటనలో శ్రీకాళహస్తిలో రాజకీయ భూకంపాన్ని లేపిన పరిణామం చోటుచేసుకుంది. జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇంచార్జ్ వినూత కోట, ఆమె భర్త చంద్రబాబు, సహ నిందితులు శివకుమార్, షైక్ తాసాన్, గోపిలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల ఫోటోలను అధికారికంగా విడుదల చేసిన పోలీసులు, మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే నదిలో లభ్యమైన మృతదేహాన్ని డ్రైవర్ శ్రీనివాసులుగా గుర్తించిన పోలీసులు, హత్యకు గల కారణాలు, ఇందులో ఉన్న కుట్రపై విస్తృతంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, దర్యాప్తు మరింత ఉత్కంఠతరంగా మారింది.

Read More : బనకచర్లకు నీటి మళ్లింపుపై జీఆర్ఎంబీ అభ్యంతరం

One thought on “Photos : రాయుడి హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి”
Comments are closed.