గుడివాడలో రాజకీయ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. స్థానికంగా టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం ఫ్లెక్సీల యుద్ధంగా మారింది. గతంలో మాజీ మంత్రి కొడాలి నాని చేసిన సవాల్‌ను గుర్తు చేస్తూ, ఆయన సీఎం చంద్రబాబును బూట్ పాలిష్ చేస్తున్నట్టుగా ఒక ఫ్లెక్సీని టీడీపీ శ్రేణులు నెహ్రూ చౌక్ వద్ద ఏర్పాటు చేశారు. “కుప్పంలో చంద్రబాబు గెలిస్తే కాళ్ల దగ్గర బూట్ పాలిష్ చేస్తాను” అన్న కొడాలి వ్యాఖ్యల్ని గుర్తు చేస్తూ ఆ ఫ్లెక్సీ సిద్ధం చేశారు. ఇదే సమయంలో వైసీపీ తరఫున “బాబు షూరిటీ, మోసం గ్యారంటీ” అనే మరో ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయడంతో గుడివాడలో రాజకీయ ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో గుడివాడలో శనివారం వైసీపీ నేతల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. మాజీ మంత్రి పేర్ని నాని ముఖ్య అతిథిగా హాజరవ్వగా, ఆయన ఇటీవల చేసిన “చీకట్లో కన్నుకొడితే తలలు నరికేయండి” అనే వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ శ్రేణులు నాగవరప్పాడు జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన వైసీపీ ఫ్లెక్సీని చించేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. ఫ్లెక్సీలు, వ్యాఖ్యలతో మండుతున్న రాజకీయ వాతావరణం వల్ల గుడివాడలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన ప్రాంతాల్లో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read More : Photos : రాయుడి హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి

One thought on “ఫ్లెక్సీలతో టీడీపీ, వైసీపీ మధ్య ఉద్రిక్తత”
Comments are closed.