కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలకు అలర్ట్

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. గురువారం హోంమంత్రి అనిత ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో టెలిఫోన్ ద్వారా మాట్లాడి, వర్షాల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని, అధికారులు క్షేత్రస్థాయిలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

ఇదిలా ఉంటే, ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ కీలక ప్రకటన చేశారు. కృష్ణా నదిలో వరద ప్రవాహం భారీగా పెరుగుతోందని తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో, మధ్యాహ్నం లోపు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రస్తుత ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 3.62 లక్షల క్యూసెక్కులు ఉన్నాయని వివరించారు.

ఈ పరిస్థితుల్లో ప్రభావిత జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లంక గ్రామాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. వినాయక నిమజ్జనాల్లో కూడా భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వాగులు, కాలువలు దాటే ప్రయత్నాలు చేయవద్దని ప్రఖర్ జైన్ స్పష్టం చేశారు.

Read More : నేటి నుంచి విశాఖలో జనసేన సమావేశాలు

One thought on “కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలకు అలర్ట్

Comments are closed.