బాహుబలి మరోసారి థియేటర్లలో సందడి చేయబోతున్నాడు!

భారత సినీ చరిత్రలో సంచలనం సృష్టించిన ఎస్‌ఎస్ రాజమౌళి విజన్‌లో రూపుదిద్దుకున్న మహా ప్రతిష్ఠాత్మక చిత్రం ‘బాహుబలి’ మళ్లీ వెండితెరపై కనిపించనుంది. ఈ చిత్రం విడుదలై పదేళ్లు పూర్తి అయిన సందర్భంగా, రెండు భాగాలనూ కలిపి ఒకే చిత్రంగా – ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఈ ఏడాది అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి, కథానాయకుడు ప్రభాస్ సోషల్ మీడియాలో స్పందించారు. “పదేళ్ల క్రితం ఒక ప్రశ్న దేశాన్ని ఏకం చేసింది. ఇప్పుడు ఆ ప్రశ్న, సమాధానం రెండూ ఒకే గొప్ప ఎపిక్‌గా మళ్ళీ వస్తున్నాయి” అని ప్రభాస్ తెలిపారు. ఈ ప్రయాణం పదేళ్లు పూర్తి చేసుకోవడం ఎంతో ప్రత్యేకమని రాజమౌళి పేర్కొన్నారు. ‘బాహుబలి: ది బిగినింగ్’ మరియు ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ భాగాల కలయికతో వస్తున్న ఈ ప్రత్యేక ఎడిషన్ అభిమానులకు మళ్లీ మాయల లోకాన్ని పరిచయం చేయనుంది. సోషల్ మీడియాలో ఈ వార్తపై అభిమానుల హర్షాతిరేకం వెల్లివిరుస్తోంది. దశాబ్దం తర్వాత కూడా అదే క్రేజ్‌తో ‘బాహుబలి’ మరోసారి థియేటర్లను ఆక్రమించేందుకు సిద్ధమవుతోంది.

Read More : పూజా హెగ్డేకు శాక్‌: మమితాకు ఛాన్స్

One thought on “బాహుబలి మరోసారి థియేటర్లలో సందడి చేయబోతున్నాడు!

Comments are closed.