పూజా హెగ్డేకు శాక్‌: మమితాకు ఛాన్స్

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన పూజా హెగ్డేకు ఈ మధ్య కాలంలో పరిస్థితులు అనుకూలంగా లేకపోయిన సంగతి తెలిసిందే. ఇటీవల వచ్చిన వరుస ఫ్లాపుల ప్రభావంతో ఆమె కెరీర్ కాస్త నెమ్మదించిందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కొత్త సినిమాలో నటించే అవకాశాన్ని పూజా కోల్పోయినట్లు సమాచారం. ప్రముఖ దర్శకుడు విగ్నేష్ రాజా తెరకెక్కించనున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా పేరును మొదట పరిగణనలోకి తీసుకున్నా, చివరికి ఆమె స్థానంలో మలయాళ బ్యూటీ మమితా బైజును ఎంపిక చేసినట్టు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ‘ప్రేమలు’ సినిమాతో గుర్తింపు పొందిన మమితా.. ఇటీవల విజయ్, సూర్య సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడంతో మంచి ఫామ్‌లో ఉన్న నటిగా ఆమెపై నమ్మకం పెరిగిందని అంటున్నారు. ఇదిలా ఉండగా, గతంలో పూజా హెగ్డే దక్షిణాది తో పాటు బాలీవుడ్‌లోనూ భారీ రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ హీరోయిన్‌గా నిలిచారు. కానీ ‘రాధే శ్యామ్’, ‘బీస్ట్’, ‘ఆచార్య’, ‘రెట్రో’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాలు సాధించకపోవడంతో ఆమె క్రేజ్ కొంత తగ్గిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే ఈ ఒక్క అవకాశం చేజారినా, ప్రస్తుతం పూజా హెగ్డే రజనీకాంత్, విజయ్, లారెన్స్ వంటి స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు, మమితాకు ధనుష్ సినిమా ద్వారా మరో క్రేజీ ఛాన్స్ దక్కినట్టు, ఆమె కెరీర్ వేగంగా ముందుకు సాగుతోందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Read MOre : ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారంపై ఈడీ కేసు

One thought on “పూజా హెగ్డేకు శాక్‌: మమితాకు ఛాన్స్

Comments are closed.