హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో ఓ పెద్ద దుమారం చోటుచేసుకుంది. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావును నకిలీ పత్రాలతో అధ్యక్ష పదవిని దక్కించుకున్నారని ఆరోపణలపై రాష్ట్ర సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు మరో నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సీఐడీ స్పష్టం చేసింది. సీఐడీ వివరాల ప్రకారం, ‘శ్రీచక్ర క్రికెట్ క్లబ్’ పేరిట జగన్మోహన్‌రావు నకిలీ డాక్యుమెంట్లు రూపొందించారట. క్లబ్ ప్రెసిడెంట్ కవిత సహకారంతో, గౌలిపురా క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు అయిన మాజీ మంత్రి సి. కృష్ణయాదవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి పత్రాలు సృష్టించారు. వాటిని ఆధారంగా చేసుకుని హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీ చేసి అధ్యక్ష పదవిని గెలుచుకున్నట్టు తెలిపారు.
అనంతరం హెచ్‌సీఏ నిధుల దుర్వినియోగంపై టీసీఏ అధ్యక్షుడు గురువారెడ్డి ఫిర్యాదు చేయగా, మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ మోసానికి సహకరించినవారిలో హెచ్‌సీఏ కోశాధికారి శ్రీనివాసరావు, సీఈవో సునీల్, రాజేందర్ యాదవ్ ఉన్నారు. నకిలీ పత్రాల తయారీలో సహకరించిన కవితను కూడా అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ వ్యవహారం నేపథ్యంలో హెచ్‌సీఏపై మరోసారి అవినీతి ఆరోపణలు మళ్లీ తెరపైకి వచ్చాయి.
Read More : హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్

One thought on “నకిలీ పత్రాలతో పదవి దక్కించుకున్న ఆరోపణలు”
Comments are closed.