ఫిష్ వెంకట్‌కు ప్రభాస్ సాయం చేసినట్లు ప్రచారం అవాస్తవం

టాలీవుడ్‌లో సహాయ పాత్రలతో గుర్తింపు పొందిన ఫిష్ వెంకట్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండు కిడ్నీలు పూర్తిగా విఫలమైన కారణంగా, ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కష్టకాలంలో ఆయన కుటుంబం ఆర్థికంగా తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటోంది. ఇందులో భాగంగా, ప్రభాస్ రూ.50 లక్షల సాయం చేశారన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇది పూర్తిగా అసత్యమని, తప్పుడు ప్రచారమని ఫిష్ వెంకట్ కుమార్తె స్పష్టం చేశారు. ఒక అనుమానాస్పద వ్యక్తి ‘ప్రభాస్ పీఏ’గా ఫోన్ చేసి మోసపూరితంగా మాటలు చెప్పాడని, ఆ తర్వాత తిరిగి సంప్రదించలేదని ఆమె తెలిపారు. ఈ ఫోన్ కాల్ ఆధారంగా అసత్య ప్రచారం జరిగినట్టు ఆమె విచారం వ్యక్తం చేశారు. “ప్రభాస్ నుంచి ఏ విధమైన ఆర్థిక సాయం మాకు అందలేదు. కేవలం ఒక ఫోన్ కాల్ మాత్రమే జరిగింది. ఆ వార్తలు వాస్తవానికి దూరమైనవి. దయచేసి ఇలాంటి ప్రచారాలు మాకు ఇబ్బంది కలిగించకండి,” అని ఆమె విన్నవించారు.

చికిత్సకు భారీ ఖర్చులు.. పరిశ్రమ నుంచి స్పందన లేనన్న కుటుంబం

వైద్యుల సూచన మేరకు వచ్చే పది రోజుల్లో కిడ్నీ మార్పిడి చేయాల్సి ఉందని, ఇందుకు భారీ మొత్తంలో ఖర్చు అవుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటికే ఒక మాజీ మంత్రి లక్ష రూపాయలు సాయం చేశారని, గబ్బర్ సింగ్ చిత్రబృందంలోని కొందరు సహాయం అందించారని పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు ‘మా’ అసోసియేషన్ గానీ, టాలీవుడ్ అగ్రహీరోలైన చిరంజీవి, పవన్ కల్యాణ్, ప్రభాస్ వంటి వారి నుంచి స్పందన రాలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమ అండగా నిలవాలని, తమ తండ్రిని ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Read More : ఫిష్ వెంకట్‌కు వైద్య సహాయం

One thought on “ఫిష్ వెంకట్‌కు ప్రభాస్ సాయం చేసినట్లు ప్రచారం అవాస్తవం

Comments are closed.