ఫిష్ వెంకట్‌కు వైద్య సహాయం

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్య సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయనకు హీరో ప్రభాస్ నుంచి మానవతా దృక్పథంతో సాయం అందింది. వెంకట్ కిడ్నీ సమస్యలతో బాధపడుతుండగా, ఆయనకు అవసరమైన వైద్య చికిత్స కోసం ప్రభాస్ తన సహాయాన్ని ప్రకటించారు.

ఈ విషయాన్ని ఫిష్ వెంకట్ కుమార్తె స్వయంగా వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం – “ప్రభాస్ గారు స్వయంగా కాకపోయినా, ఆయన అసిస్టెంట్ మమ్మల్ని సంప్రదించారు. కిడ్నీ దాత (డోనర్) ఎవరికైనా సిద్ధంగా ఉంటే, వెంటనే ఆపరేషన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ఆపరేషన్‌కు కావలసిన మొత్తం మొత్తాన్ని ప్రభాస్ గారు భరిస్తారని హామీ ఇచ్చారు” అని పేర్కొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో సహనటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించిన ఫిష్ వెంకట్ ప్రస్తుతం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలోనూ పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సహాయం చేయగా, తాజాగా ప్రభాస్ చేసిన ఈ మానవతా చర్యపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సంక్షోభ సమయంలో సహనం చూపుతూ ముందుకు వచ్చిన ప్రభాస్‌కు పలువురు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Read More : టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్‌ను ఈడీ విచారణ