టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఇటీవల డెంగీ జ్వరంతో బాధపడుతున్న ఆయన, ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విజయ్ ఆరోగ్య పరిస్థితిపై సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో ప్రార్థిస్తున్నారు.
ఇదిలా ఉంటే, విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్‌డమ్’ ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, నటుడు సత్యదేవ్ ఓ కీలక పాత్ర పోషించారు. మరోవైపు బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్ ‘డాన్ 3’లో రణవీర్ సింగ్‌కు విలన్‌గా విజయ్ దేవరకొండను సంప్రదించినట్టు సమాచారం. అయితే ఈ ఆఫర్‌కు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
విజయ్ త్వరగా కోలుకొని తిరిగి చిత్ర ప్రొమోషన్లలో పాల్గొనాలని అభిమానులు ఆశిస్తున్నారు.
Read More : మానవత్వాన్ని చాటుకున్న బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్

One thought on “యంగ్ హీరో విజయ్ దేవరకొండకు డెంగీ.. అభిమానుల్లో ఆందోళన”
Comments are closed.