విజయవాడలో ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహ మూర్తి రాజు ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. నగరంలోని అయోధ్యనగర్‌లో ఉన్న క్షత్రియ భవన్లో ఆయన శవమై కనిపించారు.నరసింహ మూర్తి రాజు గతంలో తన స్నేహితుడి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టయ్యారు. ఈ కేసులో బెయిల్‌పై ఇటీవలే విడుదలయ్యారు. అప్పుల భారంతో తీవ్రంగా కుంగిపోయిన ఆయన, సూసైడ్ నోట్ రాసి గుండెపోటుకు దారితీసే మాదకద్రవ్యం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. సూసైడ్ నోట్లో నరసింహ మూర్తి రాజు తనపై ఉన్న అప్పుల భారం వల్లే ఆత్మహత్యకు గురవుతున్నానని, ఎవరినీ బాధపెట్టాలన్న ఉద్దేశం లేదని రాశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఆయన మృతి విషయం తెలిసి కుటుంబ సభ్యులు, సన్నిహితులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. ఆదిత్య ఫార్మసీతో పాటు వ్యాపార రంగాల్లో కూడా పేరున్న నరసింహ మూర్తి రాజు మరణం వ్యాపార వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.
Read More : గుడివాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో హాజరైన కొడాలి నాని

One thought on “ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహ ఆత్మహత్య”
Comments are closed.