ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా అమరావతి రాజధాని పనులు పున:ప్రారంభం అయ్యాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన ప్రతీ ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, రాజధాని రైతులు, ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, మీడియా మరియు సోషల్ మీడియా వారికి ఆయన అభినందనలు తెలిపారు.
సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిన ముఖ్యమంత్రి, ప్రజల సహకారంతో, కేంద్ర ప్రభుత్వ మద్దతుతో, కఠినమైన ప్రణాళికతో రాజధాని అమరావతిని ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేయాలని అన్నారు. సమగ్ర అభివృద్ధి ద్వారా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో, నిన్న (శుక్రవారం) ప్రధాని మోదీ అమరావతిలో పర్యటించారు. ఆయన పర్యటనలో రాష్ట్రానికి రాష్ట్రానికి రూ. 58 వేలు కోట్ల కోసం పలు ప్రాజెక్టులకు శకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు. అమరావతి సభకు రాష్ట్రం నలుమూలల నుంచి రైతులు మరియు ప్రజలు భారీగా చేరుకున్నారు.

Read More : సభలో విక్స్ ఇచ్చిన ఆసక్తికర దృశ్యం

One thought on “ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణం : CBN”
Comments are closed.