ఏపీ అసెంబ్లీలో టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల మార్పు పై చర్చ

Budget Session

ఆంధ్రప్రదేశ్ శాసనసభ (AP Assembly) 11వ రోజు బడ్జెట్ సమావేశాలు గురువారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. శాసన మండలి (Legislative Council) పదవ రోజు సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగనున్నాయి.

శాసనసభలో టిడ్కో ఇళ్ళ లబ్ధిదారుల మార్పు, రాష్ట్రంలో వలసలు, బిల్లుల చెల్లింపులో అక్రమాలు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అక్రమాలు, విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టు తదితర అంశాలపై ప్రశ్నోత్తరాలు జరగనున్నాయి. అలాగే ఇంధన రంగంపై శాసనసభలో లఘు చర్చ నిర్వహించనున్నారు.

అయితే శాసన మండలిలో సామాజిక భద్రత ఫించన్లు, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు, పర్మిట్ రూములకు అనుమతి, పీడీఎఫ్ బియ్యం అక్రమ అమ్మకం, జగనన్న కాలనీల్లో అక్రమాలు, నూతన పర్యాటక విధానం తదితర అంశాలపై ప్రశ్నోత్తరాలు కొనసాగుతాయి.

ఇక రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది జూన్ నాటికి 3 లక్షల గృహాల నిర్మాణం పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ‘కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1.25 లక్షల గృహాలను పూర్తి చేశాం. ఇక 2026 మార్చి నాటికి 7.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఇందులో 5 లక్షల ఇళ్లను వచ్చే జూన్‌లోగా పూర్తి చేయాలని భావిస్తున్నాం. మిగిలిన ఇళ్లు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తాం’ అని మంత్రి వివరించారు.

అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణానికి అదనపు సాయం అందించేందుకు ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిందని, దీని వల్ల రూ.3,219.75 కోట్ల భారం పడుతుందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.

Read More

One thought on “ఏపీ అసెంబ్లీలో టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల మార్పు పై చర్చ

Comments are closed.