ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పాడని భర్తను హత్య చేసిన భార్య

నారాయణపేట జిల్లాలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధాన్ని నిలిపేయమని చెప్పినందుకు భర్తను గొంతు నులిమి చంపేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…నారాయణపేట మండల కేంద్రానికి చెందిన కంపిలి అంజిలప్ప (32), రాధ దంపతులు. వీరికి వివాహం జరిగి దశాబ్దం కావస్తోంది. ఇద్దరు పిల్లలున్న ఈ దంపతులు జీవనోపాధి కోసం రెండు నెలల క్రితం ముంబై వెళ్లి కూలీ పనులు చేసేవారు. అదే సమయంలో రాధకు ధన్వాడ మండలానికి చెందిన మరో యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న అంజిలప్ప, రాధను తీసుకుని తిరిగి స్వగ్రామం బయలుదేరాడు. అయితే ఊరికి వెళ్లితే పరువు పోతుందని చెబుతూ, మరోచోట పని చేసుకుందామని భార్య సూచించింది. దీంతో హైదరాబాద్‌ బాచుపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పని చేస్తూ, గుడిసెలో నివాసం ఉండసాగారు.

అక్కడ కూడా రాధ తన ప్రియుడితో సంబంధం కొనసాగిస్తుందనిపించి, గత నెల 23న అంజిలప్ప గొడవపడ్డాడు. అదేరోజు రాత్రి మద్యం మత్తులో ఉన్న భర్తను రాధ గొంతు నులిమి హత్య చేసింది. అనంతరం రాత్రి పక్కింట్లో నిద్రించిన రాధ, ఉదయం గుడిసెలోకి వెళ్లి భర్త మృతి చెందినట్లు కన్నీళ్లు పెట్టి నటించింది.అయితే ఆ హత్యపై అంజిలప్ప కుటుంబసభ్యులకు అనుమానం రావడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్‌ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు రాధను అదుపులోకి తీసుకుని గట్టి ప్రశ్నించారు. చివరకు ఆమె హత్య చేసినట్లు ఒప్పుకుంది.

ప్రస్తుతం రాధను అరెస్ట్ చేసిన పోలీసులు, ఇద్దరు చిన్నారులు తండ్రిని కోల్పోయి, తల్లి జైలుకు వెళ్లడంతో అనాథలుగా మిగిలారు. ఈ విషాదకర ఘటన నారాయణపేటలో తీవ్ర కలకలానికి దారితీసింది.

Read More : మహిళా సంఘాలకు చెక్కుల పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం భట్టి

One thought on “ప్రియుడితో మాట్లాడొద్దని చెప్పాడని భర్తను హత్య చేసిన భార్య

Comments are closed.