కేటీఆర్ విసిరిన చర్చ సవాల్‌కు గాను ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో చర్చిద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన తర్వాత కూడా ప్రతిపక్ష నాయకులు బయట వేదికలు వెతుకుతున్నారని విమర్శించారు. “అసెంబ్లీలో చర్చిద్దాం రా అంటే… మీ నాన్నే రావడం లేదు. నువ్వేమో ‘బస్తీ మే’ చర్చ అంటావ్. చాలా బజార్థస్త్ గా చెబుతున్నావ్. నిన్ను పిలిస్తే నీ బావ అంటాడు, నీ బావను పిలిస్తే నీ చెల్లి అంటుంది – ఇదేంటీ మీ ఫ్యామిలీ డైలమా?” అంటూ ఎద్దేవా చేశారు అద్దంకి దయాకర్.
ఇంకా మాట్లాడుతూ – ‘‘సమయం, వేదిక చెప్పే అధికారం మీ నాన్నకే ఇవ్వండి. రైతుల సమస్యలు మాత్రమే కాదు, ఏ ప్రశ్నైనా అడగొచ్చు. మేము జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని స్పష్టం చేశారు.
ఈ ప్రకటనతో తెలంగాణలో అధికార-ప్రతిపక్షాల మధ్య సాగుతున్న మాటల యుద్ధం మరింత ముదిరింది.
Read More : కేటీఆర్‌కు మంత్రి సీతక్క కౌంటర్
