Rahul Gandhi : బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోంది

ఐఎన్‌డీఐఏ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈసీ ప్రస్తుతం స్వతంత్ర సంస్థగా కాకుండా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.

“ఇది ఇకపై ఎన్నికల కమిషన్ కాదు.. బీజేపీ ఎన్నికల చోర్ బ్రాంచ్‌లా మారిపోయింది,” అని రాహుల్ గాంధీ ఘాటుగా వ్యాఖ్యానించారు. బీహార్ ఎన్నికల్లో ‘సర్’ అనే పేరుతో నకిలీ ఓట్లు వేయిస్తున్నారని, ఓటర్ల జాబితాలో మార్పుల పేరుతో నిజమైన ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు.

ఈసీ పక్షపాత ధోరణితో ప్రజాస్వామ్యంపై నమ్మకం పోతుందని రాహుల్ గాంధీ అన్నారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయం లో చర్చనీయాంశంగా మారాయి.

Read More : పీఎం ధన్ ధాన్య యోజనకు కేంద్ర ఆమోదం

One thought on “Rahul Gandhi : బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోంది

Comments are closed.