ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో అసాధారణమైన దృశ్యం కనిపించింది. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తన అద్భుత ఫీల్డింగ్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఒంటిచేత్తో అందుకున్న స్టన్నింగ్ క్యాచ్‌తో వెస్టిండీస్ బ్యాటర్ కేసీ కార్టీని వెనుదిరిగించాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే… మ్యాచ్ రెండో రోజు, వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 9వ ఓవర్‌ను ప్యాట్ కమ్మిన్స్ వేశాడు. ఆ ఓవర్లో బ్యాటింగ్ చేస్తున్న కార్టీ, ఓ బంతిని రక్షించేందుకు ప్రయత్నించగా అది బ్యాట్‌కు ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుని ప్యాడ్ తాకి గాల్లోకి ఎగిరింది. వెంటనే స్పందించిన కమ్మిన్స్ తన ఫాలోత్రూలో ముందుకు డైవ్ చేస్తూ, ఒంటిచేత్తో అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు.
ఈ ఘటనతో ఫీల్డ్ అంపైర్లు కొన్ని క్షణాల పాటు తడబడినప్పటికీ, వెంటనే థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. పలు కోణాల్లో రీప్లేలు పరిశీలించిన అనంతరం క్యాచ్ క్లీన్‌గానే ఉందని ధ్రువీకరించి కార్టీని ఔట్‌గా ప్రకటించారు. ప్రస్తుతం కమ్మిన్స్ అందుకున్న స్టన్నింగ్ క్యాచ్‌కు సోషల్ మీడియాలో భారీగా స్పందన వస్తోంది. నెటిజన్లు ఈ క్యాచ్‌ను “మ్యాజికల్ మోమెంట్”, “వన్ మాన్ ఆర్మీ” అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
Read More : భారత్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనపై అనిశ్చితి

One thought on “ఆస్ట్రేలియా vs వెస్టిండీస్ టెస్టులో ప్యాట్ కమ్మిన్స్ అద్భుత క్యాచ్”
Comments are closed.