భారత్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనపై అనిశ్చితి

భారత్ క్రికెట్ జట్టు ఆగస్టులో బంగ్లాదేశ్‌కు జరగాల్సిన పర్యటనపై అనిశ్చితి నెలకొంది. బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న రాజకీయ అస్థిరత, భద్రతాపరమైన సమస్యల నేపథ్యంలో ఈ పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవచ్చని సమాచారం. ఆటగాళ్ల భద్రతే తమకు ప్రాధాన్యమని, ఈ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని కేంద్రం స్పష్టం చేసినట్లు తెలిసింది.

షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 17 నుంచి మూడు వన్డేలు, మూడు టీ20లు జరగాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీసీసీఐ కేంద్ర అనుమతిని ఎదురుచూస్తోంది. అనుమతి లభించకపోతే ఈ పర్యటన వాయిదా పడే అవకాశం ఉంది. ఈ అంశంపై త్వరలోనే బీసీసీఐ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) సంయుక్త ప్రకటన విడుదల చేయనుంది.

మాధ్యమ హక్కులపై బీసీబీ వెనక్కు – ఆర్థికంగా నష్టాలు

ఈ సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని 2025–27 కాలానికి మీడియా హక్కుల అమ్మకానికి బీసీబీ ప్రణాళికలు రూపొందించింది. జూలై 7, 10 తేదీల్లో బిడ్డింగ్ చేపట్టాలని భావించిన బీసీబీ, తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసింది. పర్యటన రద్దయ్యే సూచనలతో బోర్డుకు ఆర్థికంగా గట్టి దెబ్బ తగలనుంది. పాకిస్థాన్ మ్యాచ్‌ల మాదిరిగా ఈ సిరీస్‌ను తటస్థ వేదికపై నిర్వహించాలన్న ఆలోచన కూడా చర్చలో ఉంది.

Read More : ఘన విజయంతో మెరిసిన భారత యువ ఛెస్‌ ప్లేయర్

One thought on “భారత్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్ పర్యటనపై అనిశ్చితి

Comments are closed.