సంగారెడ్డి జిల్లా సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనపై మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల శరీర అవశేషాలను కార్డుబోర్డ్ పెట్టెల్లో భద్రపరచడాన్ని ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. “వలస కార్మికుల కుటుంబాలకు గౌరవం ఇవ్వలేరా? పేదవారి ప్రాణాలకు విలువ లేదా?” అని ప్రశ్నించిన కేటీఆర్, ఈ దారుణ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఎండగట్టారు. ఈ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


One thought on “వలస కార్మికుల అవశేషాలపై కేటీఆర్ ఆగ్రహం”
Comments are closed.