దివ్యాంగుల హక్కుల కోసం ఆగస్టు 13న మహాగర్జన

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దివ్యాంగుల పెన్షన్‌ను రూ.6,000కి, ఆసరా పెన్షన్‌ను రూ.4,000కి, తీవ్ర వైకల్యం గల వారికి రూ.15,000కి పెంచాలని కోరారు. గురువారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, ఈ విషయాలపై స్పష్టంగా స్పందించారు. ఆగస్టు 13న ఎల్‌బీ స్టేడియంలో దివ్యాంగులు, ఆసరా పింఛన్‌దారుల ‘మహాగర్జన’ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలని, అలాగే నామినేటెడ్ పదవుల్లోనూ దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దివ్యాంగుల హక్కుల కోసం జరిగే ఈ మహాగర్జనకు పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

Read More : మృతుల మాంసపు ముద్దలను బాక్సుల్లో అప్పగించిన విషాద ఘటన

One thought on “దివ్యాంగుల హక్కుల కోసం ఆగస్టు 13న మహాగర్జన

Comments are closed.