తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పరిపాలనా వైఫల్యాన్ని ప్రజల దృష్టిలోనుంచి తప్పించేందుకు కేటీఆర్‌పై కక్షసాధింపులకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.
“కేటీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు… ఓ శక్తి,” అని వ్యాఖ్యానించిన హరీశ్ రావు, కక్షసాధింపులే లక్ష్యంగా తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో చుట్టేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో తమకు దగ్గినా, తుమ్మినా కేసులు పెడుతున్నారని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.
కేటీఆర్‌ను ఎన్ని కేసులతో వేధించినా, ఆయన తలవంచే నేత కాదని… ఆయన వెనుక తెలంగాణ ప్రజలంతా ఉన్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. లక్షలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కేటీఆర్‌కు మద్దతుగా నిలుస్తారని, ఆయనను తప్పుదోవ పట్టించే వారిని ప్రజలే తాకిడీ చేస్తారని హెచ్చరించారు.
Read More : రైతులకు శుభవార్త: రేపటి నుండి రైతు భరోసా నిధుల జమ

One thought on “కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకోవడం CM చేతకానితనానికి నిదర్శనం:”
Comments are closed.