జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా గుండెపోటుతో యువకుడి మృతి

హరియాణా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని బల్లాభ్‌గఢ్ సెక్టార్–9లో దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. అదికిలోల బరువుతో బాధపడుతున్న పంకజ్ శర్మ (37) అనే యువకుడు జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అతడు రాజానహర్‌సింగ్ కాలనీకి చెందినవాడు కాగా, 170 కిలోల బరువు తగ్గేందుకు నాలుగు నెలల క్రితం జిమ్‌లో చేరాడు. వారాంతంలో వర్కౌట్ ప్రారంభించేముందు బ్లాక్ టీ తాగిన పంకజ్, పుల్‌అప్స్ చేయడం ప్రారంభించాడు. అయితే వర్కౌట్ మధ్యలోనే ఒక్కసారిగా అతడు పడి పోయాడు. ఇది గమనించిన స్నేహితులు అతనికి నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. వెంటనే CPR కూడా రెండు సార్లు చేశారు. అయితే అప్పటికే పంకజ్ శర్మ మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు.

ఈ ఘటన జిమ్‌లో వర్కౌట్ చేసే వారికి ఒక్కసారిగా గట్టి అప్రమత్తత కలిగించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మెడికల్ చెకప్ లేకుండా, అధిక బరువుతో ఉన్నవారు ఏకాంతంగా కఠినమైన వ్యాయామాలు చేయడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read More : యూకే పర్యటన పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు తిరిగిన కేటీఆర్

One thought on “జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా గుండెపోటుతో యువకుడి మృతి

Comments are closed.