విమానంలో పాము కలకలం..

ఆస్ట్రేలియాలో ఓ విమానంలో పాము కలకలం రేపింది. మెల్‌బోర్న్‌ ఎయిర్‌పోర్టు నుంచి బ్రిస్బేన్‌కు వెళ్లాల్సిన విమానంలో విషపూరిత పాము దూరింది. ఇది ప్రయాణికుల సామాన్ల విభాగంలోకి వెళ్లిపోయిన సమయంలో సిబ్బంది గుర్తించారు. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. పామును పట్టుకునేందుకు ప్రత్యేకంగా స్నేక్ క్యాచర్‌ను పిలిపించారు. సుమారు అరగంటపాటు శ్రమించి పామును సురక్షితంగా బయటకు తీసుకున్నారు. అనంతరం విమానాన్ని పూర్తిగా తనిఖీ చేసిన తరువాతే టేకాఫ్‌కు అనుమతి ఇచ్చారు. ఈ కారణంగా విమానం రెండు గంటల పాటు ఆలస్యంగా బయలుదేరింది.

Read More : భారత్, చైనా ఉత్పత్తులపై 500% సుంకాలు?