అమెరికా ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించిన మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. మంగళవారం దౌత్య కేబుల్ ద్వారా యూఎస్ ఎంబసీలకు ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి
విద్యార్థుల వీసా ప్రాసెస్‌పై నియంత్రణ మరింత కఠినతరం చేసే దిశగా అమెరికా అడుగులు వేస్తోంది. విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాల పరిశీలనకు సిద్ధమవుతున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. అవసరమైన పరిశీలనల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
తదుపరి ఆదేశాలు వెలువడే వరకు కొత్త వీసా ఇంటర్వ్యూలకు అపాయింట్‌మెంట్‌లను అనుమతించబోమని స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే షెడ్యూల్ అయిన ఇంటర్వ్యూలు యధాతథంగా కొనసాగుతాయని తెలిపారు. ఈ పరిస్థితి వల్ల అమెరికాలో చదవాలనుకునే అనేక మంది విదేశీ విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.
Read More : అమెరికాలో ఇండియన్ స్టూడెంట్ వీసాలపై కీలక హెచ్చరిక.

One thought on “అమెరికా స్టూడెంట్ వీసా : కొత్త నిబంధనలు అమలులోకి.”
Comments are closed.