శంషాబాద్ విమానాశ్రయంలో వాతావరణ ప్రభావం

హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల పలు విమానాల ల్యాండింగ్‌ పై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్తగా పలు విమానాలను ఇతర నగరాలకు మళ్లించినట్లు అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి నుంచి విమానాశ్రయం ప్రాంతంలో విపరీతంగా మేఘావృత వాతావరణం నెలకొనడంతో ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించారు. లఖ్‌నవూ, కోల్‌కతా, ముంబయి, జయపుర నుంచి హైదరాబాద్‌ రావాల్సిన విమానాల్లో కొన్ని బెంగళూరుకు, మరికొన్ని విజయవాడకు మళ్లించారని తెలిపారు. అదేవిధంగా బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ విమానాన్ని కూడా విజయవాడలో ల్యాండ్ చేయించారు.

ఇదిలా ఉండగా, బుధవారం ఉదయం నుంచి వాతావరణం స్థిరపడటంతో అన్ని విమానాలు తిరిగి శంషాబాద్‌కు చేరుకున్నాయి. ప్రస్తుతం విమానాశ్రయంలో అన్ని కార్యకలాపాలు సవ్యంగా కొనసాగుతున్నాయని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని అధికారులు స్పష్టం చేశారు.

Read More : రాజకీయ భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చిన రాజాసింగ్…

One thought on “శంషాబాద్ విమానాశ్రయంలో వాతావరణ ప్రభావం

Comments are closed.