పాకిస్థాన్‌కు సమాచారం లీక్ చేస్తూ 12 మంది అరెస్టు.

దేశ భద్రతకు తీవ్రంగా ముప్పుగా మారిన గూఢచర్య ముఠా గుట్టును భద్రతా ఏజెన్సీలు భేధించాయి. పాకిస్థాన్‌తో సంబంధాలున్న 12 మందిని, రెండు వారాల వ్యవధిలో భద్రతా బలగాలు అరెస్టు చేయడం సంచలనంగా మారింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో వరుసగా ఈ అరెస్టులు జరిగాయి. ఇందులో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కూడా ఉండటం చర్చనీయాంశమైంది.

ఇతరులు కూడా పాక్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐకి అత్యంత రహస్యమైన సమాచారం పంపించారని ఆరోపణలు ఉన్నాయి. ఫోటోలు, వీడియోలు, ఆర్మీ కంటోన్మెంట్లు, బీఎస్‌ఎఫ్ క్యాంపులు, బలగాల కదలికలు తదితర వివరాలను పాకిస్థాన్‌కి పంపించినట్లు అధికారులు తెలిపారు.

అరెస్టుల వివరాలు:

  • మే 4: పంజాబ్‌లోని అజ్నాలా, అమృత్‌సర్‌కు చెందిన ఫలక్‌షేర్ మసిహ్, సూరజ్ మసిహ్ అరెస్టు
  • మే 11: గుజాలా, యామిన్ మహ్మద్ – ఢిల్లీ పాక్ హైకమిషన్‌లో పనిచేసిన డానిష్‌తో సంబంధాలు
  • మే 15: సుఖ్‌ప్రీత్ సింగ్, కరణ్‌బీర్ సింగ్ – ‘ఆపరేషన్ సిందూర్’కు సంబంధించి కీలక సమాచారం లీక్
  • అదే రోజున పానిపట్‌లో నౌమాన్ ఇలాహి అరెస్టు
  • మే 16: కైథల్‌కు చెందిన దేవేందర్ సింగ్ అరెస్టు – గతంలో పాకిస్థాన్ ప్రయాణం
  • అదే రోజు హిసార్‌కు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్టు
  • మే 17: నుహ్ జిల్లాలో అర్మాన్ అరెస్టు
  • మే 18: రాంపుర్‌లో షెహజాద్ అరెస్టు – పాక్‌కు అక్రమంగా వస్తువులు తరలింపు

ఈ అరెస్టుల్లో చాలా మంది గూఢచారులు ఆన్‌లైన్ ద్వారా డబ్బులు తీసుకుని, పాక్ ఏజెంట్లకు సమాచారాన్ని అందించినట్లు విచారణలో తేలింది. గూఢచారి కార్యకలాపాలతో పాటు అక్రమ రవాణా, విదేశీ సన్నిహితులతో సంబంధాలపై భద్రతా ఏజెన్సీలు లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి.

ఈ ఘటనలు దేశ భద్రతపై ముంచుకొస్తున్న ముప్పును చాటుతున్నాయి. ఇకపై గూఢచారులపై కఠిన చర్యలు తీసుకోవాలని భద్రతా వర్గాలు స్పష్టంగా పేర్కొంటున్నాయి.

Read More : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గూస్ బంప్స్ వీడియో విడుదల.

One thought on “పాకిస్థాన్‌కు సమాచారం లీక్ చేస్తూ 12 మంది అరెస్టు.

Comments are closed.