ప్రభాస్ ‘రాజాసాబ్’ ఐటెం పాటలో కరీనా?

ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్‌టైనర్‌ “రాజాసాబ్” షూటింగ్ మళ్లీ వేగం పుంజుకుంది. గత కొంతకాలంగా నత్తనడకన సాగిన ఈ ప్రాజెక్ట్‌ జూలై తొలి వారంలో శరవేగంగా కొనసాగనున్న షెడ్యూల్‌తో కీలక దశలోకి అడుగుపెడుతోంది. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్ కూడా పాల్గొననున్నారు. ఈ భాగం పూర్తయితే చిత్రీకరణ దాదాపుగా ముగిసినట్టే అని భావిస్తున్నారు. అనంతరం పాటల చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా ఓ మాస్ ఐటం సాంగ్‌ కూడా ఉండబోతోంది. ఈ పాటను ప్రభాస్‌ మాస్ ఇమేజ్‌కు తగ్గట్లుగా డిజైన్ చేయాలని సంగీత దర్శకుడు తమన్ ముందుగా బాలీవుడ్‌ రీమిక్స్‌ పాటను ఎంపిక చేయాలనుకున్నా, చివరికి కొత్తగా ఓ ఒరిజినల్‌ సాంగ్‌తో రావాలని నిర్ణయించుకున్నాడు.

ఈ స్పెషల్ సాంగ్ కోసం మొదట లేడీ సూపర్‌స్టార్‌ నయనతారను సంప్రదించినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆమె ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్టు తెలిసింది. ఆ తర్వాత ఈ పాట విషయంలో ఎలాంటి చర్చలు జరగలేదు.

ఇప్పుడు మళ్లీ షూటింగ్ వేగంగా సాగుతుండటంతో ఐటం సాంగ్‌ కోసం హీరోయిన్ ఎవరన్నది టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్‌ను సంప్రదించే దిశగా దర్శకుడు మారుతి ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలిసింది. ఓ ప్రముఖ ఏజెన్సీ ద్వారా కరీనాకు ఆఫర్ వెళ్లినట్టు సమాచారం. కరీనా ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలపై దృష్టి సారించడంతో, ఆమె ఈ మాస్ ఐటం సాంగ్‌కు అంగీకరిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అభిమానులు కరీనాను ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేస్తే చూడాలన్న ఉత్సాహంతో ఉన్నారు. అయితే ఆమె స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Read More : రోడ్డు ప్రమాదంపై షైన్ టామ్ చాకో భావోద్వేగ స్పందన

One thought on “ప్రభాస్ ‘రాజాసాబ్’ ఐటెం పాటలో కరీనా?

Comments are closed.