ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న “క్వాంటమ్ వ్యాలీ” ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం మొదటి అడుగు వేసింది. ఈ నేపథ్యంలో విజయవాడలో నిర్వహిస్తున్న ప్రత్యేక వర్క్‌షాప్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, ఇన్నోవేషన్ శాఖ మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొని కీలక భేటీల్లో పాల్గొన్నారు. ఈ వర్క్‌షాప్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్వాంటమ్ టెక్నాలజీ కంపెనీల ప్రతినిధులు, పరిశోధకులు, టెక్ లీడర్లు పాల్గొన్నారు. క్వాంటమ్ టెక్నాలజీపై ఉన్న తాజా ట్రెండ్‌లు, గ్లోబల్ ఎకో సిస్టమ్, పారిశ్రామిక అవసరాలు తదితర అంశాలపై సీఎం చంద్రబాబు నాయుడు వారిని వ్యక్తిగతంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు తమ అభిప్రాయాలు, సూచనలు, సహకారం ప్రకటించారు.
అమరావతిలో నిర్మించనున్న క్వాంటమ్ వ్యాలీ ద్వారా రాష్ట్రం గ్లోబల్ టెక్ మ్యాప్‌లో నిలబడేలా సీఎం చంద్రబాబు సంకల్పించారని వర్క్‌షాప్ వర్గాలు వెల్లడించాయి. యువతకు ఉపాధి అవకాశాలు, పరిశోధనలో సహకారం, కొత్త కంపెనీల ఆకర్షణ వంటి అంశాలపై సమగ్రమైన చర్చలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం క్వాంటమ్ టెక్నాలజీని ప్రోత్సహించడానికి అవసరమైన విధానాలను రూపొందించనుంది.
Read More : ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా మాధవ్ ఖరారు!

One thought on “అమరావతిలో క్వాంటమ్ వ్యాలీపై సీఎం సమావేశం”
Comments are closed.