రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను అభివృద్ధి దిశగా తీసుకెళ్లే ప్రయత్నాల్లో భాగంగా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు. తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచిన డోల వాసుదేవరావు అనే ఉపాధ్యాయుడిని మంత్రి అభినందించారు.
ఈ విషయంపై సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో స్పందించిన లోకేశ్.. ‘‘ఇలాంటి సంఘటనలు చూస్తే, విద్యా రంగంలో మార్పు కోసం చేసిన శ్రమ సఫలమవుతోందని అనిపిస్తుంది. ఈ మార్పే నా ఆశ’’ అని పేర్కొన్నారు.
రాజాం నియోజకవర్గంలోని డోలపేటకు చెందిన వాసుదేవరావు తన పిల్లలను ప్రభుత్వ బడిలో చదివిస్తున్నారు. దీనిపై స్పందించిన మంత్రి లోకేశ్.. ‘‘రాజకీయాలకు అతీతంగా, సమగ్ర విద్యకు దగ్గరగా ఉన్న పాఠశాలలు ఏర్పడతాయని ఈ చర్య నిదర్శనం. ప్రభుత్వ బడుల్లో ‘నో అడ్మిషన్’ బోర్డులు పెట్టే స్థాయికి తీసుకెళ్లాలనే నా కలను నిజం చేయడంలో వాసు మాస్టర్ లాంటి వారి పాత్ర అమోఘం’’ అని ప్రశంసించారు.
ఇంకా మాట్లాడుతూ, ‘‘మన బడికి మనమే అంబాసిడర్లు కావాలి. విద్యా రంగంలో తీసుకుంటున్న సంస్కరణలే ఈ మార్పుకు దోహదపడుతున్నాయి. అందరం కలిసికట్టుగా ఆంధ్రప్రదేశ్‌ను దేశానికి మార్గదర్శకంగా నిలిపేలా ‘ఏపీ మోడల్ ఎడ్యుకేషన్’కు రూపకల్పన చేద్దాం’’ అని పిలుపునిచ్చారు.
Read More : అమరావతిలో క్వాంటమ్ వ్యాలీపై సీఎం సమావేశం

One thought on “ప్రభుత్వ బడిలో పిల్లల చేర్పు: Minister”
Comments are closed.