ఏపీని గ్లోబల్ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దుతాం: CM

ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పర్యాటక నక్సపటంలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘ ప్రణాళికలు రూపొందించారు. శుక్రవారం విజయవాడలో జరిగిన ‘గ్లోబల్ ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ (జీఎఫ్‌ఎస్‌టీ)’ టూరిజం కాన్‌క్లేవ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం మాట్లాడుతూ, పర్యాటక రంగాన్ని ‘వెల్‌నెస్, హ్యాపీనెస్ ఫ్యూచర్ డెస్టినేషన్’గా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు.

చంద్రబాబు స్పష్టం చేసిన అంశాలు:

  • టూరిజం ఐటీని మించిన ఉపాధిని కల్పించగలదు. రాష్ట్రంలో దాదాపు 3 వేల హోటల్ గదులు ఉండగా, నాలుగేళ్లలో ఈ సంఖ్యను 15 వేల వరకు పెంచుతామని చెప్పారు.
  • ప్రాజెక్టులకు వేగవంతమైన అనుమతులు, విద్యుత్ సబ్సిడీలు, పారదర్శక పాలనకు హామీ ఇచ్చారు.
  • బాబా రామ్‌దేవ్‌ను రాష్ట్ర పర్యాటక రంగానికి సలహాదారుగా వ్యవహరించాలని కోరారు.
  • అమరావతిలో క్వాంటం వ్యాలీ, ఏఐ టెక్నాలజీ ప్రాజెక్టులు ప్రారంభమవుతాయని, ఆగస్టు 15 నాటికి అన్ని పౌరసేవలు వాట్సాప్‌ ద్వారా అందుబాటులోకి వస్తాయని హామీ ఇచ్చారు.
  • “ఇది పెట్టుబడులకు అనువైన సమయం. ఇప్పుడు కాకపోతే, భవిష్యత్తులో అవకాశం కోల్పోతారు” అంటూ పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు.

పుణ్యక్షేత్రాలు, ప్రకృతి అందాలు కలగలిసిన ఏపీని టూరిజంలో అగ్రస్థానానికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం గట్టి పూనికతో పనిచేస్తుందని చంద్రబాబు వివరించారు.

Read More : గుడివాడలో కోర్టుకు హాజరైన కొడాలి నాని – వైసీపీ శ్రేణుల్లో జోష్

One thought on “ఏపీని గ్లోబల్ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దుతాం: CM

Comments are closed.