మొహర్రం సందర్భంగా ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్ (పూర్వం ట్విట్టర్) వేదికగా ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి ఆయన సందేశం ఇచ్చారు.
“మానవ హక్కుల కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటానికి గుర్తే మొహర్రం. మహమ్మద్ ప్రవక్త మనుమడైన ఇమామ్ హుస్సేన్ను శత్రువులు బలిగొన్న రోజు ఇది. మొహర్రం మాసం ప్రారంభం సందర్భంగా ఇస్లామిక్ నూతన సంవత్సరం మొదలవుతుంది. ముస్లిం సోదరులు తమ సాంప్రదాయాలకు అనుగుణంగా మొహర్రం పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను,” అని సీఎం ట్వీట్లో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కూడా ట్విట్టర్ ద్వారా ముస్లిం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మొహర్రం చారిత్రకంగా ఎంతో గొప్ప భావాలను పంచే పర్వదినమని, ఇది త్యాగానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. మొహర్రం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. శాంతి, సౌభ్రాతృత్వ వాతావరణంలో మొహర్రం జరుపుకోవాలని అధికారులు కోరుతున్నారు.
Read More : వైఎస్ జగన్పై షర్మిల సంచలన ఆరోపణలు…

2 thoughts on “మొహర్రం సందర్భంగా ముస్లిం సోదరులకు సీఎం”
Comments are closed.