వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రయాణించిన బుల్లెట్ ప్రూఫ్ కారును రవాణా శాఖ అధికారులు శుక్రవారం తనిఖీ చేశారు. ఇటీవల పల్నాడు జిల్లా రెంటపాళ్లలో జరిగిన దురదృష్టకర రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఈ చర్యలు తీసుకున్నారు. ఫిట్‌నెస్, సాంకేతిక పరిస్థితులను మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ గంగాధర ప్రసాద్ నేతృత్వంలోని బృందం పరిశీలించింది. తనిఖీకి గురైన వాహనం — ఏపీ 40 డీహెచ్ 2349 నంబరుతో ఉన్న ఫార్చ్యూనర్ కారు — ప్రస్తుతం జిల్లా పోలీసు కార్యాలయంలో నిలిపిఉంచారు. ఈ కారుతోనే ఇటీవల జగన్ పర్యటనకు వెళ్లిన సమయంలో, సింగయ్య అనే వ్యక్తి కిందపడిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఈ విషాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసులో జగన్‌తోపాటు డ్రైవర్ రమణారెడ్డి, పర్సనల్ అసిస్టెంట్ నాగేశ్వర్‌రెడ్డిలను నిందితులుగా చేర్చారు. ఈ నేపథ్యంలో వాహన తనిఖీతో పాటు, మరిన్ని ఆధారాలు సేకరించే ప్రయత్నం సాగుతోంది.
పోలీసు వర్గాలు చెబుతున్నట్లుగా, తనిఖీ నివేదిక అనంతరం తదుపరి విచారణకు వాహనాన్ని తమ వద్దే ఉంచినట్టు స్పష్టం చేశారు. ఈ ఘటనపై విచారణ మరింత వేగవంతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read More : మొహర్రం సందర్భంగా ముస్లిం సోదరులకు సీఎం
