తెలంగాణ నిరుద్యోగ సమస్యలపై మీడియా మౌనం

తెలంగాణలోని నిరుద్యోగ సమస్యలపై కొన్ని ప్రముఖ తెలుగు పత్రికలు మౌనాన్ని పాటిస్తున్నాయని కొంతమంది యువత సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నిరుద్యోగుల సమస్యలపై కంటె, చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై మాత్రం పెద్దపెద్ద వార్తలు ప్రచురిస్తున్నాయని ఆంధ్రజ్యోతి, ఈనాడు వంటి పత్రికలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

‘‘నిరుద్యోగుల వేదనలకు నోరు మెదపని పత్రికలు, చంద్రబాబుకి తేలికపాటి అస్వస్థత వచ్చినా బిగ్ బ్రేకింగ్‌లు ఇస్తున్నాయి’’ అంటూ ఓ యువకుడు పోస్టు చేశాడు. ఆయన తన పోస్టులో “మా సమస్యలపై ఒక్క కథనం రాయడం మీ వల్ల కాదా ABN రాధాకృష్ణ గారు?” అంటూ ప్రశ్నించారు.

ఇక మరోవైపు, తెలంగాణ ఉద్యమం నాటి నుంచి కొన్ని ఆంధ్రా మాధ్యమాలు తెలంగాణపై కక్షతో వ్యవహరిస్తున్నాయన్న వాదనతో, ఈ పత్రికలకు తెలంగాణలో విస్తృత కార్యాలయాలు ఎందుకు అవసరం అని కొందరు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత మీడియాపై ఉందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Read More : రైతుబంధు రద్దు చేస్తే ఓఆర్ఆర్ పై 2 లక్షల రైతులతో ఆందోళన

One thought on “తెలంగాణ నిరుద్యోగ సమస్యలపై మీడియా మౌనం

Comments are closed.