వైసీపీ నేత అనుచరుడు – తమన్నా ఫొటోలు వైరల్

ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ మరల సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు ప్రముఖులు అరెస్టు కాగా, తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సన్నిహితుడు వెంకటేశ్ నాయుడు పేరు హాట్‌టాపిక్‌గా మారింది. నోట్ల కట్టలను లెక్కిస్తున్న ఆయన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఇప్పుడు సినీ నటి తమన్నాతో కలిసి ఉన్న ఫొటోలు కొత్త చర్చకు దారితీసాయి.

సమాచారం ప్రకారం, తమన్నా మరియు వెంకటేశ్ నాయుడు కలిసి ఒక ప్రత్యేక జెట్‌లో ప్రయాణించారు. ఈ ప్రయాణానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సినీ ప్రముఖులతో కూడా వెంకటేశ్ నాయుడు సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడనే చర్చ టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.

ఈ ప్రత్యేక జెట్ ప్రయాణంపై తమన్నా ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. ఇదిలా ఉండగా, ఈ పరిణామాలు లిక్కర్ స్కామ్ దర్యాప్తులో కొత్త మలుపు తిరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

One thought on “వైసీపీ నేత అనుచరుడు – తమన్నా ఫొటోలు వైరల్

Comments are closed.