రైతుబంధు రద్దు చేస్తే ఓఆర్ఆర్ పై 2 లక్షల రైతులతో ఆందోళన

రైతుబంధు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం కావాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. ఓఆర్ఆర్ (ఔటర్ రింగ్ రోడ్) లోపల ఉన్న రైతులకు రైతుబంధు వర్తించదని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తే, అది తగిన నిర్ణయం కాదని ఆయన తీవ్రంగా విమర్శించారు.

“రైతుబంధు మంజూరు చేయకపోతే… రెండు లక్షల మంది రైతులతో కలిసి ఓఆర్ఆర్ మీద కూర్చుంటాము. అక్కడే వంటా వార్పు చేసుకుంటాము. రైతుల హక్కుల కోసం ఉద్యమించడానికి ఏ మాత్రం వెనుకాడమన్న ప్రశ్నే లేదు” అని హరీష్ రావు స్పష్టం చేశారు.
రైతులను విస్మరించడం, వాగ్దానాలను తుంగలో తొక్కడం సహించదగిన అంశాలు కాదని ఆయన పేర్కొన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Read More : ఆక్స్‌ఫర్డ్‌లో కేటీఆర్ ప్రసంగం

One thought on “రైతుబంధు రద్దు చేస్తే ఓఆర్ఆర్ పై 2 లక్షల రైతులతో ఆందోళన

Comments are closed.