లిక్కర్ కేసులో చెవిరెడ్డి, వెంకటేష్‌ కస్టడీకి ఏపీ సిట్ పిటిషన్

మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన వైసీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గడ్డం వెంకటేష్‌లపై ఆంధ్రప్రదేశ్ సిట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో మరింత సమాచారం సేకరించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, వారిని విచారించేందుకు ఐదు రోజుల కస్టడీ ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.లిక్కర్ కేసు దర్యాప్తు వేగంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో సిట్ అధికారులు విచారణ మరింత లోతుగా చేయాలని భావిస్తున్నారు. అందుకే, ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న చెవిరెడ్డి, వెంకటేష్‌లను విచారణ కోసం తమ కస్టడీలోకి ఇవ్వాలని కోరుతూ గురువారం పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసులో మరిన్ని ఆధారాలు, నిధుల ప్రవాహం, సంబంధిత వ్యక్తుల పాత్రలు తదితర అంశాలను స్పష్టంగా తెలుసుకునే లక్ష్యంతోనే సిట్ ఈ చర్యకు పాల్పడింది. కోర్టు ఈ పిటిషన్‌పై త్వరలో విచారణ చేపట్టనుంది.

Read More : తప్పు చేసినవారికి శిక్ష తప్పదు: మంత్రి

One thought on “లిక్కర్ కేసులో చెవిరెడ్డి, వెంకటేష్‌ కస్టడీకి ఏపీ సిట్ పిటిషన్

Comments are closed.