ఏయిర్ ఇండియా AI-171 విమానం 242 మంది ప్రయాణికులతో అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో కుప్పకూలిన విషాదకర ఘటన గురించి తెలుసుకుని తాను తీవ్రమైన దిగ్భ్రాంతికి గురయ్యానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ ప్రమాదం ఊహించని విధంగా జరిగిందని, విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే మంటలు చెలరేగి భయంకరమైన విధ్వంసానికి దారితీసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ఇలాంటి విషాద ఘటనలు దేశ ప్రజలందరినీ కలచివేస్తాయని పేర్కొన్న జగన్, ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాలుగా అండగా నిలవాలని కోరారు.
Read More : అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదంపై CM ఆవేదన

One thought on “అహ్మదాబాద్ ప్రమాదంపై వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి”
Comments are closed.