ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తొలి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 23న ప్రత్యేక సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుపుతోంది. ‘సుపరిపాలన తొలి అడుగు’ అనే నినాదంతో ఈ సభను ఆదివారం సాయంత్రం 5 గంటలకు అమరావతి వెలగపూడిలోని సచివాలయం వెనుకభాగంలో నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు ప్రకటించాయి.
ఈ సందర్భంగా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాప్రయోజన కార్యక్రమాల ప్రగతిని ప్రజలకు వివరించనున్నారు. ఈ సభకు ముఖ్యమంత్రి, మంత్రిమండలి సభ్యులు, ప్రజాప్రతినిధులతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది.
Read More : లిక్కర్ కేసులో చెవిరెడ్డి, వెంకటేష్ కస్టడీకి ఏపీ సిట్ పిటిషన్
