తన కెరీర్ ప్రారంభం దక్షిణాది సినిమాల ద్వారానే జరిగిందని జెనీలియా గుర్తు చేస్తూ, “నాకు మంచి పాత్రలు దక్కాయి. నేను బాగా నేర్చుకున్నాను. ఆ పరిశ్రమ నాకు ఎదుగుదలకు అవకాశం ఇచ్చింది. కాబట్టి నేను నిజంగా కృతజ్ఞురాలిని” అని పేర్కొన్నారు.
తమిళంలో ‘బాయ్స్’లో హరిణిగా, తెలుగులో ‘బొమ్మరిల్లు’లో హాసినిగా ఆమె చేసిన పాత్రలు ఎంతగానో అభిమానులను ఆకట్టుకున్నాయని, అదే సమయంలో తన నటనా ప్రతిభను పటిష్టంగా నిలిపాయని జెనీలియా గుర్తు చేశారు. ఈ రెండు సినిమాలు తనకు ప్రత్యేక గుర్తింపునిచ్చాయని అన్నారు.
స్త్రీ పాత్రలను నిర్లక్ష్యం చేస్తారన్న విమర్శలను తాను పూర్తిగా ఖండిస్తున్నట్టు ఆమె స్పష్టం చేశారు. “దక్షిణాదిలో నేను అద్భుతమైన అనుభవాలు పొందాను. అది నా నటిగా ఎదుగుదలకు పెద్ద బలంగా నిలిచింది” అని పేర్కొన్నారు.
ప్రస్తుతం బాలీవుడ్లో ‘సీతారే జమీన్ పర్’ చిత్రంతో రీ-ఎంట్రీ ఇస్తున్న జెనీలియా, గతానికి సంబంధించిన మంచి అనుభవాలను గౌరవించడమే కాకుండా, ఆ వేదిక తన స్టార్డమ్కు బీజం వేసిందని చెప్పడం విశేషం. సినీ పరిశ్రమల్లో మారుతున్న దృష్టికోణాన్ని సూచించేలా జెనీలియా వ్యాఖ్యలు ఉండడం గమనార్హం.
Read More : సినీ నటుడు ఆర్య ఇంటిపై ఐటీ శాఖ సోదాలు

One thought on “దక్షిణాది సినిమాలపై జెనీలియా ప్రశంసలు”
Comments are closed.