నేషనల్ లెవెల్‌ క్రేజ్‌ను సెట్ చేస్తున్న రష్మిక!

Rashmika Mandanna Call Me Fab Ad

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌లో తన ప్రభావాన్ని కొనసాగిస్తూ సినిమాలు, బ్రాండ్స్‌లో వరుస విజయాలు అందుకుంటోంది. బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకోవడంతో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ఇటీవల కాలంలో ఏ దక్షిణాది హీరోయిన్‌కు రష్మిక స్థాయిలో పాపులారిటీ దక్కలేదని చెప్పొచ్చు.

సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనల్లో కూడా రష్మిక హవా కొనసాగుతోంది. తాజాగా ఓ కొత్త ఫోన్ బ్రాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన రష్మిక, “కాల్ మీ ఫ్యాబ్” అంటూ ఒక మిర్రర్ సెల్ఫీ షేర్ చేసి సోషల్ మీడియాలో హంగామా చేసింది. ఆమె చేతిలో కొత్త ఫోన్ కనపడడంతో ఆ బ్రాండ్‌కు ప్రత్యేక ఆకర్షణ ఏర్పడింది.

రష్మిక పాపులారిటీతో బ్రాండ్ డిమాండ్ పెరిగిపోగా, ఫ్యాన్స్ ఆ ఫోన్ వివరాల కోసం వెతకడం మొదలుపెట్టారు. ఆమె చేసే ప్రతి అడుగూ ట్రెండ్ అవుతూ సోషల్ మీడియాలో చర్చకు మారుతోంది. యాడ్స్ ద్వారా కూడా తన రేంజ్ ఏంటో రుజువు చేస్తోంది రష్మిక.

ప్రస్తుతం రష్మిక ‘కుబేర’, ‘గర్ల్‌ఫ్రెండ్‌’ సినిమాల్లో నటించడంతో పాటు బాలీవుడ్‌లో మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌ సైన్ చేసినట్టు సమాచారం. నేషనల్ క్రష్‌గా మాత్రమే కాకుండా, నేషనల్ లెవెల్‌లో సెన్సేషనల్ స్టార్‌గా రష్మిక తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది.

Read More


One thought on “నేషనల్ లెవెల్‌ క్రేజ్‌ను సెట్ చేస్తున్న రష్మిక!

Comments are closed.