ఎయిర్ ఇండియా ప్రమాదంలో : స్పష్టమైన వివరాలు

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మొత్తం 265 మంది దుర్మరణం పాలయ్యారు. విమానంలో ప్రయాణిస్తున్న 229 మంది ప్రయాణికులతో పాటు 12 మంది సిబ్బంది కూడా ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

ఈ ప్రమాదంలో విశ్వాస్ అనే ఒక ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడాడు. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విమానం కూలిన సమయంలో సమీపంలోని మెడికల్ కాలేజీపై పడడంతో అక్కడ ఉన్న 24 మంది మరణించారు.

ఈ దుర్ఘటనలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి కూడా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్‌కు చెందిన వారు, ఏడుగురు పోర్చుగీస్ దేశస్థులు, ఒకరు కెనడా పౌరుడు ఉన్నారు.

మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు టాటా సన్స్ గ్రూప్ ఛైర్మన్ ఒక్కో కుటుంబానికి రూ.1 కోటి పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు. ప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలు ముమ్మరం చేసింది.

Read More : లండన్‌కు వెళ్తూ నవ వధువు మృతి

One thought on “ఎయిర్ ఇండియా ప్రమాదంలో : స్పష్టమైన వివరాలు

Comments are closed.