మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ఐశ్వర్య గౌడ్ అనే మహిళ చేసిన సంచలన వ్యాఖ్యలతో, కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తమ్ముడు డీకే సురేష్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది.
గతంలో పలువురిని తన బంధువులుగా చెబుతూ, కోట్ల రూపాయల మేరకు నగదు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్న ఐశ్వర్య గౌడ్ (33) అనే మహిళ ఇటీవల ఈడీ చేత అరెస్టయ్యారు. విచారణలో డీకే సురేష్ తనకు పరిచయమని ఆమె పేర్కొనడంతో ఈడీ అధికారులు డీకే సురేష్‌ను విచారణకు పిలిచినట్లు సమాచారం.
ఈ కేసుతో సంబంధం ఉన్న అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతుందని ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఐశ్వర్య గౌడ్ మనీ లాండరింగ్ కేసులో కీలక భూమిక పోషించిందనే అనుమానాల నేపథ్యంలో ఆమె పరిచయాలు, లావాదేవీలను అధికారులు ఆరా తీస్తున్నారు.
