2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత సుదీర్ఘ కాలం తరువాత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో టియాంజిన్ నగరంలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి చైనాకు వెళ్ళనున్నారు. ఇది 2019 తర్వాత ఆయన చైనాలో చేసే తొలి పర్యటనగా ఉంది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్ బీజింగ్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ప్రధాని మోదీ ఎస్సీఓ సదస్సులో పాల్గొనడం మేము సాదరంగా స్వాగతిస్తున్నాము. అన్ని సభ్య దేశాల సమాఖ్య సహకారంతో సదస్సు విజయవంతమవుతుంది” అన్నారు. గత నాలుగేళ్లుగా గల్వాన్ ఘర్షణల కారణంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగినప్పటికీ, ఇటీవల ఎల్ఏసీ ప్రాంతంలో గస్తీ విషయంలో అనేక రకాల అంగీకారాలు జరిగినవి. ఈ నేపథ్యంలో మోదీ పర్యటన సానుకూల సంకేతంగా భావిస్తున్నారు.
ఇది కేవలం ఒక అంతర్జాతీయ సదస్సు మాత్రమే కాదు, భారత్, చైనా, రష్యా, పాకిస్థాన్ వంటి 10 సభ్య దేశాలతో కూడిన ఎస్సీఓ సంస్థ చరిత్రలో అతిపెద్ద సమావేశంగా చైనా పేర్కొంది. సుమారు 20 దేశాల నేతలు, 10 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు.
అంతేకాదు, భారత్-చైనా సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడంపై ఈ సందర్భంగా ఉన్నత స్థాయి నేతల సమావేశాలు ఇప్పటికే జరుగుతున్నాయి. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనాలో పర్యటించి భద్రతా, ఉగ్రవాద వ్యతిరేక చర్యలపై చర్చలు జరిపారు.
ఈ పర్యటనతో భారత్, చైనా మధ్య సరిహద్దు, వ్యూహాత్మక అంశాలలో సానుకూల పరిణామాలు ఆశిస్తున్నట్లు విశ్లేషకులు అంటున్నారు.
Read More : గాజాను నియంత్రణలోకి తీసుకునేందుకు ఇజ్రాయెల్ ప్రణాళికలు

One thought on “ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా చైనా పర్యటనకు”
Comments are closed.